BREAKING
షాబాద్‌లో ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభం వ్యవసాయ భూమిలో మొసలి సంచారం.. గ్రామస్థుల్లో ఆందోళన! కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై హర్షం నిమ్మనపల్లికి హెల్త్ సెంటర్, సోలార్ లైట్లు, తాగునీటి బోర్లు మంజూరు చేయాలి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సర్పంచ్ వేల్పుల రమేష్ వినతి ఓటీటీలో సందడి చేస్తోన్న సందీప్ కిషన్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ప్రాజెక్ట్ జెడ్! కడప సుధాకర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న ఎంపిటిసి ధనలక్ష్మీ : కోటకాడపల్లి అభివృద్ధికి కృషిచేయాలని సూచించిన అప్ప ఉపాధి హామీ పనికి శ్రీకారం. కుందుర్పి మండలం లో చిరుత సంచారం. ఈజిప్టు రైలు దుర్ఘటన: రాజకీయ జవాబుదారీతనానికి డిమాండ్ నూతన ఈవీ వాహనాల షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు మొబైల్ షాపుల యజమానుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ చలికాలంలో రోజూ నారింజ పండ్లు తింటున్నారా.. శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా! విజయనగరం జిల్లాలో చరిత్ర సృష్టించిన దత్తిరాజేరు మండలం* *మూడున్నర దశాబ్దాల తర్వాత టిడిపి కైవసం చేసుకున్న దత్తిరాజేరు పీఠం* *మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యూహం సూపర్ హిట్* టాటా ఐఫోన్ ప్లాంట్‌లో ఘోరం: ముగ్గురు కార్మికులు మృతి టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా జహీరాబాద్‌కు చెందిన అమిత్ రాజ్ (అంజి) నియామకం

లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపట్టాలి... * విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ *

Select Suryaa Now
లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపట్టాలి... * విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ *

విజయనగరం, సూర్య : విజయనగరం జిల్లాలోని వివిధ న్యాయ స్థానాల్లో డిసెంబరు 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్  ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ  జిల్లాలోని వివిధ న్యాయ స్థానాల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలతో ఎక్కువ కేసులు పరిష్కారం (రాజీ) అయ్యే విధంగా సంబంధిత పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీసు స్టేషను పరిధిలో నమోదైన కేసుల్లో ఇరు వర్గాలు రాజీ అయ్యేందుకు అవకాశం ఉన్న కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, చిన్న క్రిమినల్ కేసులు, ట్రాఫిక్ కేసులు, ఎక్సైజ్, రోడ్డు ప్రమాద కేసులు మరియు ఇతర కాంపౌండు కేసులను ముందుగా గుర్తించాలన్నారు. ఆయా కేసుల్లో ఇరు వర్గాలతో సంప్రదించి, సమావేశాలు నిర్వహించి, వారు రాజీ అయ్యే విధంగా మానవతా దృక్పదంతో వ్యవహరించాలన్నారు. ఇందుకుగాను పోలీసు స్టేషను స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ రోజూ లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే కేసులను సంబంధిత అధికారులను పర్యవేక్షించాలని, లోక్ అదాలత్ విజయ వంతం అయ్యేందు అధికారులు, సిబ్బంది ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. కేసుల్లోని ఇరు వర్గాలపై ఒత్తిడి లేకుండా, సహకారాత్మక వాతావరణంలో రాజీ అయ్యేలా వారిని ప్రోత్సహించాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తే కేసులు త్వరగా, సానుకూలంగా రాజీ అయ్యే అవకాశాలు పెరుగుతాయన్నారు. ఎక్కువ కేసులు లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపట్టడం వలన న్యాయ వ్యవస్థపై భారం తగ్గి, బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని జిల్లా ఎస్పీ   ఎ.ఆర్.దామోదర్ అన్నారు. లోక్ అదాలత్ లో పరిష్కారమయ్యే కేసులను ప్రతీ రోజూ ఆయా సబ్ డివిజన్లుకు చెందిన డిఎస్పీలు, సిఐలు పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్  అధికారులను ఆదేశించారు.