లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిచ్చిన రామగిరి గంగమ్మ తల్లి
మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య: లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలోదర్శనమిచ్చిన రామగిరి గంగమ్మ తల్లి !!
రామగిరి మేజర్ న్యూస్: రామగిరి మండల కేంద్రంలో వెలసి ఉన్న గంగమ్మ తల్లి ఆలయంలో గురువారం దేవి శరన్నవరాత్రి పూజల్లో భాగంగా ఐదవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో గంగమ్మ అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది. లలితా త్రిపుర సుందరీ దేవి ఆది పరాశక్తి , దశ మహా విద్యలలో ఒకరు..ఈ సందర్భంగా టిడిపి నాయకుడు పేపర్ శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలసి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.