అశ్వారావుపేట ఎస్హెచ్ఓగా సాయి కిషోర్ రెడ్డి*
*అశ్వారావుపేట ఎస్హెచ్ఓగా సాయి కిషోర్ రెడ్డి*
అశ్వారావుపేట ఎస్హెచ్ఓగా సాయి కిషోర్ రెడ్డి నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాధారణ బదిలీలలో భాగంగా సాయి కిషోర్ రెడ్డి అశ్వరావుపేటకు బదిలీ అయ్యారు. గతంలో అశ్వరావుపేట ట్రైనింగ్ ఎస్ఐగా పనిచేసి, దమ్మపేట ఎస్సై గా పనిచేసిన సాయి కిషోర్ రెడ్డి అశ్వరావుపేట ఎస్సైగా ఇక్కడికి వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండలంలో శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రధాన బాధ్యతని, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని, ఏ సమస్య ఉన్నా నేరుగా తమను సంప్రదించవచ్చని సూచించారు.గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచించారు.ఆయనకు పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.
సూర్య ప్రతినిధి మునీర్ అశ్వరావుపేట