గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ
సూర్య రెంజల్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలు వాటి అభివృద్ధి లక్ష్యంగా గ్రామపంచాయతీ భవన నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయటం హర్షనీయమని సర్పంచ్ రెమ్మ భానుచందర్ అన్నారు. రెంజల్ మండలంలోని కళ్యాపూర్ లో గురువారం గ్రామపంచాయతీ పరిధిలో గల దాత స్థలంలో పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఇజిఎస్ నిధుల నుండి 20 లక్షల రూపాయలతో నిధులు మంజూరు చేసి, భవన నిర్మాణానికి కృషి చేసినట్లు సర్పంచ్ తెలిపారు. భవన నిర్మాణానికి మంజూరుకు కృషిచేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డు సభ్యులు లవన్, ఇస్మాయిల్, శరత్, ఇంద్ర, పంచాయతీ కార్యదర్శి నవీన్, గ్రామ మాజీ సర్పంచులు, ఉపసర్పంచులు, కుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.