అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు. ఎస్. పి.పోలింగ్ స్టేషన్ లు పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు.
సూర్య న్యూస్ దర్శి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రావు హెచ్చరించారు. దర్శి లో పోలింగ్ బూత్లను ఎస్పీ గురువారం పరిశీలించారు. హై స్కూల్ లోనే పోలింగ్ బూత్లను పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్ల పై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ సిబ్బంది ని కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ సీఐ నాగమల్లేశ్వరరావు ఎస్సై ఏడుకొండలు సిబ్బంది పాల్గొన్నారు.