ధనలక్ష్మిగా వాసవి మాత 1.5 కోట్ల రూపాయలతో అలంకరణ
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో 59వ శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈరోజు గురువారం అమ్మవారిని కోటి యాభై లక్షల రూపాయల నాణేలు మరియు కొత్త కాగితాలతో అమ్మవారిని ఆలయాన్ని అలంకరించారు. గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ వబిశెట్టి నటరాజు ల పర్యవేక్షణలో శ్రీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొర్లపర రాము, కార్యదర్శులు నున్నా సుందర్రావు, కోశాధికారి బోగవల్లి రమేష్, ఆలయ కార్యదర్శులు ఆలపాటి చిన్న, ఆలపాటి సత్యనారాయణ మరియు డైరెక్టర్ల సహాయ సహకారాలతో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నామని. కమల హోమాలు, కుంకుమ పూజలు, లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు బ్రహ్మశ్రీ రామం వారి శిష్య బృందం నేతృత్వంలో పూజారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. వాసవి మాత అమ్మవారు విశేషాలంకారంలో ధనలక్ష్మి దేవిగా, ఉత్సవమూర్తి అలంకారంగా విజయలక్ష్మి అమ్మవారి గా పూజలు అందుకుంటున్నారు. ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు సేకరిస్తూ ఉన్నారు.
రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా,