కరెంట్ షాక్తో జూనియర్ లైన్మెన్ మృతి!
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం బొడబండ్ల పంచాయతీ పరిధిలోని డేగలబండ గ్రామ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది.
విద్యుత్ లైన్ మారుస్తుండగా కరెంట్ షాక్ తగిలి జూనియర్ లైన్మెన్ మునికుమార్ మృతి చెందాడు.
చిన్న విద్యుత్ స్తంభాలను తొలగించి పెద్ద స్తంభాలు ఏర్పాటు చేసిన అనంతరం లైన్ లాగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
మృతుడు తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన వ్యక్తిగా తెలిసింది.
అసలు ప్రమాదానికి కారణాలేంటి? అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది…