కుక్కర్ కు ఓటేయండి..... గ్రామ అభివృద్ధికి చోటు ఇవ్వండి.
కుక్కర్ కు ఓటేయండి..... గ్రామ అభివృద్ధికి చోటు ఇవ్వండి.
ఎన్నికల ప్రచారంలో వార్డు సభ్యుడు మూగ బాలస్వామి.
ముత్తుకూరు, నవంబర్ 28( మేజర్ న్యూస్) పంటపాలెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో రెండవ వార్డుసభ్యుడిగా పోటీ చేస్తున్న తనకు ఎన్నికల కమిషనర్ కేటాయించిన కుక్కర్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థి మూగ బాలస్వామి శనివారం గ్రామంలో ఆయా వార్డునందు ఇంటింటి ప్రచారాన్ని జోరుగా సాగించారు. ఓటర్లకు కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు వేయాలని కోరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని తెలియజేశారు. అభివృద్ధికి చోటు కల్పించి సంక్షేమం పొందాలని తద్వారా గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వార్డు సభ్యుడు ఓటర్లకు వివరించారు.