కుక్కల అజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు. సగం చెరువులో వైద్య శిబిరాలు.. వృద్ధులకు, చిన్నారులకు నిత్యావసర సరుకుల పంపిణీ.
పాలకొల్లు, సూర్య న్యూస్ రూరల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కుక్కల అజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా సగం చెరువు గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కంటి వైద్య శిబిరం, దంత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. అలాగే సగం చెరువు జాతీయ రహదారి వద్ద నూతన బస్ షెల్టర్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
విశ్వ మానవ వేదిక ఆధ్వర్యంలో వృద్ధులకు భోజన ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రాచల్ శాస్త్రి చిల్డ్రన్ హోమ్లోని చిన్నారులకు కూడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా లయన్ అడబాల వెంకటరమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో పీఎంజేఎఫ్ లయన్ మేక శ్రీరామ్ సురేష్ (ఐఎంఎం, గతంలో ఎంసీసీ), లయన్ నందుల సీతారాం (జీఎంఏ సమన్వయకర్త), లయన్ కారుమూరి రామలింగేశ్వరరావు, లయన్ ఎస్వీ రంగారావు, లయన్ సొలస సుబ్బారావు, లయన్ నిట్టల శివ శైలజ, లయన్ మద్దా సుధీర్, లయన్ మల్లిపూడి రామకృష్ణ (కోశాధికారి), లయన్ ఈదుపల్లి శ్రీధర్ (కార్యదర్శి) పాల్గొన్నారు.
సేవా కార్యక్రమాల ద్వారా పేదలు, వృద్ధులు, చిన్నారులకు సహాయం అందించడంతో పాటు ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు