కూటమి అవినీతి, దోపిడీ పాలనకు చరమగీతం పాడాలి విశాఖ జిల్లా అధ్యక్షలు కె.కె రాజు, మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి
సీతమ్మధార, సూర్య : వైసిపి పార్టీ విశాఖ ఉత్తరనియోజకవర్గం సీతమ్మధార రైతు బజారు కంచరపాలెం రైతు బజార్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షలు,విశాఖ ఉత్తర నియోజకవర్గసమన్వయకర్త కె.కె రాజు పాల్గొని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవీఎంసీ మేయర్ అభ్యర్దిని వరుదు కల్యాణి ని 52వ వార్డు వైసిపి అభ్యర్థి సాడి పద్మారెడ్డి, 53 వ వార్డు అభ్యర్థి సాసు పల్లి రాజకుమారి,63వార్డు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని గుజ్జు వెంకటరెడ్డి శ్రీదేవి ని,64 వార్డు అభ్యర్థి రెయ్యు వెంకటరమణ ని గెలిపించాలని ఓటరు మహాశయులను కోరారు.
ఈ సందర్భంగా కె.కె రాజు మాట్లాడుతూ రెండున్నరేళ్ల క్రితం కూటమి ప్రభుత్వం సామాన్యులకు, దిగువ మధ్యతరగతి ప్రజలకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మోసం చేసిందని మండిపడ్డారు.నగర కార్పొరేషన్ ఎన్నికల్లో చంద్రబాబుకు, ఆయన పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రొంగలి జగన్నాథం,తుల్లిచంద్ర శేఖర్, కేవీ బాబా,అల్లంపల్లి రాజు బాబు, 63,64 వార్డు నాయకులు గిన్ని రాధాకృష్ణ,సొండిసురేష్, యడ్ల సిధార్ధ, ధీరజ్ రెడ్డి,మోహన్, గంట కామరాజు,రమణమ్మ, సుజాత, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.