కూచినపూడి గ్రామపంచాయతీ పాలనలో ఇప్పటివరకు పోటీ తత్వం నెలకొంది … నల్లపాటి ధనలక్ష్మి, ఎల్లయ్య రాకతో ఏకగ్రీవం అయింది
నిజాంపట్నం, మేజర్ న్యూస్:
స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా కూచినపూడి గ్రామపంచాయతీ ఓసి మహిళా సర్పంచ్ గా రిజర్వేషన్ కావడంతో ఆ గ్రామస్తుడైన టిడిపి సీనియర్ నాయకుడు నల్లపాటి ఎల్లయ్య సతీమణి నల్లపాటి ధనలక్ష్మికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వారి సోదరులు శివప్రసాద్ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా ధనలక్ష్మికి అవకాశం కల్పించారు. భర్త ఎల్లయ్య గత 30 సంవత్సరాల నుండి టీడీపీ పార్టీకి తన సేవలందిస్తూ వచ్చారు. గ్రామంలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ అనగాని దృష్టికి తీసుకువెళ్లి వారి ఆదేశాల అనుగుణంగా వాటిని పరిష్కరించేవారు. ఈ క్రమంలో వైసీపీ పాలనలో గ్రామపంచాయతీ కి నిధులు రాక గ్రామం అభివృద్ధి కుంటుపడింది. ఈ క్రమంలో గ్రామ ప్రజలు నిరాశ చెందకుండా బాధ్యతను తన భుజాలపై వేసుకున్న ఎల్లయ్య గ్రామంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా పంచాయితీలో ఉన్న బోర్లను రిపేర్ చేయించడమే గాక, కొత్త బోర్లను ఏర్పాటు చేసి తాగునీటి సమస్య రాకుండా చూశారు. అంతేకాక వీధిలైట్లు, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టి, సమస్యలు తలెత్తకుండా గ్రామ ప్రజలకు తన సేవలు అందించారు. ఈ క్రమంలో ఎల్లయ్య సతీమణి ధనలక్ష్మి కి గ్రామ సర్పంచ్ గా ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంచాయితీ ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు పార్టీల మద్దతు తో పోటీలో నిలబడి సర్పంచ్ గా గెలవటమే తప్ప ఇప్పటివరకు ఏకగ్రీవంగా గెలిచిన దాఖలాలే లేవు. నల్లపాటి ధనలక్ష్మి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయటంతో గ్రామ ప్రజలు ఆమెకు పట్టం కట్టారు. ఈ సందర్భంగా నా గెలుపు కారణమైన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ వారి సోదరులు టిడిపి కోఆర్డినేటర్ శివ ప్రసాద్, మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు కృషి ఫలితమేనని వారికి ధనలక్ష్మి, ఎల్లయ్యలు కృతజ్ఞతలు తెలిపారు. కూచినపూడి పంచాయితీ లో ఉన్న అన్ని శివారు గ్రామాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.