కోనలో వైభవంగా నరసింహ స్వామి కల్యాణం
కోనలో వైభవంగా నరసింహ స్వామి కల్యాణం
నెల్లూరు కల్చరల్/రాపూరు మేజర్ న్యూస్
రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. వేకువజామున ఉదయం శ్రీ స్వామివారికి అభిషేకం, శ్రీవార్లకు కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి సమేత శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామికి సహస్రదీపాలంకరణ సేవ కన్నులపండువగా సాగింది. ఈ సందర్భంగా భక్తులు సమర్పించిన 100 గొడుగులతో నిర్వహించిన తిరుచ్చి సేవ ప్రధానార్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
దేవస్థానం ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో కార్యక్రమాలను సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించారు.
శనివారం ఒక్కరోజే వివిధ సేవలు, దర్శనాలు మరియు ప్రసాదాల విక్రయం ద్వారా దేవస్థానానికి మొత్తం రూ. 4,34,180/- ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు.