BREAKING
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి

కండ్రికలో పలగాని బాబురావు పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Select Suryaa Now
కండ్రికలో పలగాని బాబురావు పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

విజయవాడ సెంట్రల్, మేజర్ న్యూస్: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కండ్రిక పంప్‌హౌస్ వద్ద పలగాని బాబురావు పార్కు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. గతంలో రూ.2,000గా ఉన్న సామాజిక పింఛన్‌ను రూ.4,000కు పెంచడం పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల విద్యకు ఆర్థిక సహాయం అందిస్తుండగా, స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు రూ.700 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని, రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. అలాగే, సుమారు రూ.11 కోట్లతో పార్కుల అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పార్కుల్లో మహిళలకు వ్యాయామ సదుపాయాలు, చిన్నారులకు ఆటస్థలాలు ఏర్పాటు చేసి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించనున్నట్లు చెప్పారు. అంతర్గత ప్రాంతాల్లోని పార్కులను కూడా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని సమస్యలు లేని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో 63వ డివిజన్ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, కోలా శ్రీను, పైడి శ్రీను, పలగాని భాగ్యలక్ష్మి, మోత్కూరి కాసిం, 64వ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. బాబు, యూనిట్ ఇన్‌ఛార్జులు కాకొల్లు సాయి హర్ష, ఝాన్సీ, రాజేష్, బూత్ కన్వీనర్ తెల్ల భవాని, కోరాడ రమణ, బలుగూరి ప్రసాద్ తదితర డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.