కమాండ్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ సరళి పరిశీలన
ఏలూరు, మేజర్ న్యూస్ : ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్, నూజివీడు , జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని ఏలూరు రేంజ్ ఐజీ జి వి జి అశోక్ కుమార్ , జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ పర్యవేక్షించారు.
ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్టమైన పోలీసు బందోబస్తు
ఏలూరు జిల్లా పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్ ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ రూమ్ నుంచి పర్యవేక్షించారు.
వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటి కప్పుడు పరిశీలిస్తూ, ఎన్నికల నిర్వహణ ను పర్యవేక్షించారు.
ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట భద్రత రాజ్యాంగం ద్వారా ప్రజలకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు, భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఏలూరు జిల్లా పరిధిలోని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించారు.
పోలింగ్ కేంద్రాలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు పోలీసు సిబ్బంది అవసరమైన సహాయ సహకారాలు అందించారు.
ప్రతి ఓటరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకున్నారు.