BREAKING
జడ్ పి చైర్మన్ ను కలసిన మెట్టూరు బిట్ వన్ నేతలు. నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.10 వేల విరాళం మత్స్యకారుల జీవితాల్లో ఆర్థిక భరోసా.. ఆక్వా రంగానికి అభివృద్ధి బాట కోటబొమ్మాళిలో ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన కేంద్రాల వద్ద పోలీసుల నిఘా బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి స్కానింగ్ కేంద్రాలపై నిరంతర నిఘా తొలిరోజు 48 సర్పంచ్, 164 వార్డు నామినేషన్లు సైకిల్ గుర్తుకే మీ ఓటు ప్రశాంతంగా ముగిసిన అరసవల్లి, శ్రీకూర్మం తెప్పోత్సవాలు మాచవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మైపాల తాతాజీ ముమ్మర ఎన్నికల ప్రచారం.. సిరివెళ్ల పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపాని వీడి తెదేపాలో చేరిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అవమానం.. ప్రోటోకాల్ ఉల్లంఘనపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఖండన ఆర్.వెంకంపేట సర్పంచ్‌గా పెంట అప్పారావు ఏకగ్రీవ ఎన్నిక అక్రమాలలు దౌర్జన్యాలతో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పిటిసి మరియు సర్పంచ్ ఎన్నికలు

కళ్యాణదుర్గం డివిజన్ లో 10 మండలాల్లో సర్పంచ్, వార్డు మెంబెర్ బరి లో 3080 మంది అభ్యర్థులు.

Select Suryaa Now
కళ్యాణదుర్గం డివిజన్ లో 10 మండలాల్లో సర్పంచ్, వార్డు మెంబెర్ బరి లో 3080 మంది అభ్యర్థులు.

కళ్యాణదుర్గం  డివిజన్  పంచాయత  ఎన్నికల నామినేషన్లు, ఉపసంహరణల ప్రక్రియ ముగియడంతో సర్పంచ్, వార్డు సభ్యుల తుది పోటీ అభ్యర్థుల జాబితా వెల్లడైంది. పది మండలాల పరిధిలోని 161 గ్రామ పంచాయతీలు, 1,722 వార్డులకు సంబంధించి మొత్తం 382 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2,698 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మరోవైపు ఏడు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, 366 వార్డుల్లో వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నవంబర్ 21వ తేదీ నాటికి వెల్లడైన తుది నివేదిక ప్రకారం బొమ్మనహాళ్ మండలంలో 19 గ్రామ పంచాయతీలు, 196 వార్డులకు గాను 43 మంది సర్పంచ్ అభ్యర్థులు, 179 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బొమ్మనహాళ్, సిద్ధారంపురం, సింగనహాళ్, ఉప్పరహాళ్ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ మండలంలో 120 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. బ్రహ్మసముద్రం మండలంలో 16 గ్రామ పంచాయతీలు, 170 వార్డులకు సంబంధించి 33 మంది సర్పంచ్ అభ్యర్థులు, 250 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాకపోయినా 33 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. పిల్లలపల్లి, రాయలప్పదొడ్డి, తీతకల్ గ్రామాల్లోని అన్ని వార్డులతో పాటు ఎస్.కొండాపురంలోని 8, 11వ వార్డులు ఏకగ్రీవమయ్యాయి. డి.హిరేహాళ్ మండలంలో 16 గ్రామ పంచాయతీలు, 168 వార్డులకు 44 మంది సర్పంచ్ అభ్యర్థులు, 197 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. హనుమాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కాగా, మొత్తం 52 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. చెర్లోపల్లి, గోదిసెలపల్లి, ఎం.హనుమాపురం, ఓబుళాపురం, పులకుర్తి గ్రామాల్లోని అన్ని వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. గుమ్మగట్ట మండలంలో 15 గ్రామ పంచాయతీలు, 164 వార్డులకు 39 మంది సర్పంచ్ అభ్యర్థులు, 220 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ మండలంలో 53 వార్డులు ఏకగ్రీవం కాగా, గుమ్మగట్ట గ్రామంలోని అన్ని వార్డుల్లో ఏకగ్రీవ ఎన్నికలు నమోదయ్యాయి. కళ్యాణదుర్గం మండలంలో 17 గ్రామ పంచాయతీలు, 182 వార్డులకు సంబంధించి 37 మంది సర్పంచ్ అభ్యర్థులు, 321 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక్కడ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాలేదు. మొత్తం 22 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కొండాపురం, తిమ్మసముద్రం, పి.టి.ఆర్.పల్లి, బైరదహళ్లి, పలవాయి, బత్తువానిపల్లి గ్రామాల్లోని పలు వార్డుల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి. కంబదూరు మండలంలో 12 గ్రామ పంచాయతీలు, 142 వార్డులకు 26 మంది సర్పంచ్ అభ్యర్థులు, 281 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పోటీలో ఉండగా, రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కణేకల్లు మండలంలో 18 గ్రామ పంచాయతీలు, 196 వార్డులకు 39 మంది సర్పంచ్ అభ్యర్థులు, 317 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పోటీలో నిలిచారు. కలేకుర్తి, గోపులాపురం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ మండలంలో 38 వార్డులు ఏకగ్రీవం కాగా, గోపులాపురం గ్రామంలోని అన్ని వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. కుందుర్పి మండలంలో 13 గ్రామ పంచాయతీలు, 148 వార్డులకు 36 మంది సర్పంచ్ అభ్యర్థులు, 286 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ మండలంలో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాలేదు. రెండు వార్డులు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. రాయదుర్గం మండలంలో 19 గ్రామ పంచాయతీలు, 186 వార్డులకు 47 మంది సర్పంచ్ అభ్యర్థులు, 313 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మల్లాపురం, నాగిరెడ్డిపల్లి, రేకులకుంట గ్రామాల్లోని అన్ని వార్డులు ఏకగ్రీవం కాగా, వద్రహొన్నూరులో ఆరు వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మొత్తం 35 వార్డుల్లో ఏకగ్రీవ ఎన్నికలు నమోదయ్యాయి. సెట్టూరు మండలంలో 16 గ్రామ పంచాయతీలు, 170 వార్డులకు 38 మంది సర్పంచ్ అభ్యర్థులు, 334 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు బరిలో ఉన్నారు. ములకలేడు, పెరుగుపాళ్యం, తిప్పనపల్లి గ్రామాల్లోని పలు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఈ మండలంలో మొత్తం తొమ్మిది వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మొత్తంగా పది మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు తుది పోటీ స్పష్టమైంది. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలు, వార్డుల్లో ఎన్నికల సందడి తగ్గగా, పోటీ ఉన్న ప్రాంతాల్లో అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో నెలకొన్న స్థానిక సమస్యలు, అభివృద్ధి హామీలు, రాజకీయ సమీకరణాలు ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. ప్రధాన పార్టీల మద్దతుతో పాటు స్థానిక నాయకుల ప్రభావం కూడా అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేయనుంది. దీంతో రాబోయే ఎన్నికలపై గ్రామీణ ప్రాంతాల్లో ఆసక్తి నెలకొంది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.