కలువాయి స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం..మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
కలువాయి, మేజర్ న్యూస్ : కలువాయి మండలంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థుల ఘనవిజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం నెల్లూరులోని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో కలువాయి మండలానికి చెందిన పలువురు ప్రముఖ నాయకులు, ముఖ్య నేతలు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి రాజారెడ్డి, మజ్జిగ పెంచలరెడ్డి, రాపూరు దశరథరామిరెడ్డి, కొల్లపనేని లక్ష్మీనారాయణ, కొలమూరు వేణురెడ్డి, చిన్నప్పరెడ్డి, ఉయ్యాలపల్లి కాలేషా, ఎర్రబల్లి పరదేశి, గాలం కిష్టయ్య, సంకల ఎరుకలయ్య,,చింతలాత్మకూరు ప్రభావతి తదితర ప్రముఖులు స్తానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి తమవంతు పూర్తి సహకారం అందిస్తామని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. నెల్లూరు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, నాయకులందరూ పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా ముందుకు సాగాలని, కూటమి అభ్యర్థుల విజయానికి అంకితభావంతో కృషి చేయాలని కోరారు.