BREAKING
*బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సయ్యద్ అతర్ అఫ్సర్‌కు జన్మదిన శుభాకాంక్షలు* పశ్చిమ బెంగాల్‌లో పరారీలో ఉన్న హెరాయిన్ కేసు నిందితుడి అరెస్ట్ అయ్యప్ప స్వాముల అన్న సమారాధన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి -బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి *వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను కాపాడుకుందాం: ఎంపీడీవో ఉమాదేవి* రత్న సాగర్ ‘బిలీవ్’ లీడర్‌షిప్ ఇంగ్లీష్ కోర్సు ప్రారంభం – ముఖ్య అతిథిగా పుల్లెల గోపీచంద్ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం సైకిల్ గుర్తుపై ఓటేసి బైరెడ్డి జాహ్నవి రెడ్డిని గెలిపించండి జిన్నారంలో అయ్యప్ప మండల దీక్షలు ప్రారంభం యోగాక్రీడలకు ఎంపిక పూర్తి లక్ష్మీపతిగూడెంలో సత్యసాయి పల్లకి సేవ కార్యక్రమం పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలి: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాత్లావత్ చందర్ తెలంగాణ రక్షణ సేనలో సంగారెడ్డి నియోజకవర్గానికి నూతన నియామకాలు దీపావళి పండుగ విశిష్టతపై ఇంటింటా భగవద్గీత ప్రచారం పోలింగ్ సామగ్రి స్వీకరణలో నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి

కలివెలపాళెంలో జోరుగా జడ్పీటీసీ అభ్యర్థి చెన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
కలివెలపాళెంలో జోరుగా జడ్పీటీసీ అభ్యర్థి చెన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎన్నికల ప్రచారం

నెల్లూరు రూరల్,  మేజర్ న్యూస్ :   నెల్లూరు రూరల్ మండల జడ్పీటీసీ కూటమి అభ్యర్థి చెన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం తన స్వగ్రామమైన కలివెలపాళెంలో వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి వీధిలో గడపగడపకు వెళ్లి ప్రజలను కలుసుకుంటూ తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా చెన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి ఇంటి వద్ద ఆయనకు అపూర్వ ఆదరణ లభించడంతో ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఓటర్లకు తెలుగుదేశం పార్టీ కరపత్రాలు పంపిణీ చేస్తూ కూటమి అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆశీస్సులతో జడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచానని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో జడ్పీటీసీగా విజయం సాధించి రూరల్ మండల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనించాలని, అర్హులైన పేదలకు ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్లు అందాలన్నా, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందాలన్నా, గ్రామాలు, నియోజకవర్గం, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నా కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.తన సోదరుడు చెన్నారెడ్డి సురేందర్ రెడ్డి సహకారంతో ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశామని తెలిపారు. గతంలో కలివెలపాళెం పీఏసీఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ప్రజలకు అందించిన సేవలు తనకు మంచి గుర్తింపు తెచ్చాయని, అదే ప్రజాభిమానం ఈ ఎన్నికల్లోనూ తనకు అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కలివెలపాళెంలో వందలాది మందితో నిర్వహించిన ర్యాలీ, ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ సాగుతున్న ప్రచారంతో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది. చెన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది.