andhrapradesh
కదిరి వైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అత్తర్ పర్వీన్ ప్రచార హోరు
వైఎస్ఆర్సిపి కాంగ్రె స్ పార్టీ కదిరి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అత్తార్ పర్వీన్ ప్రచార కార్యక్రమానికి అశేషంగా జనం తరలివచ్చి ప్రచార పర్వంలో పాల్గొ న్నారు. శనివారం పట్టణంలోని పలు వార్డులలో ప్రచార కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అత్తార్ పర్వీన్ తో పాటు మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా, వైసిపి రాష్ట్ర నాయకులు పూల శ్రీనివాసులు రెడ్డి, సాదత్ అలీఖాన్, లింగాల లోకేశ్వర్ రెడ్డి, కదిరి పట్టణ అధ్యక్షుడు షేక్ బాబ్జాన్ , మాజీ ఆలయ చైర్మన్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రతి గడపకు వెళుతూ.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. సందర్భంగా ప్రతి గడపకు వెళ్ళిన చైర్మన్ అభ్యర్థి కరపత్రాన్ని అందిస్తూ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగించారు. ప్రచారం విస్తృతంగా కొనసాగడంతో వీధులన్నీ వైసిపి జెండాలు రెపరెప లాడాయి. వైఎస్ఆర్సిపి పార్టీ గెలుపు తోనే మళ్లీ కదిరి అభివృద్ధి సాధ్యమనీ ఓటర్లకు వివరించినట్లు నాయకులు తెలిపారు. అనం తరం వైసిపి నాయకులకు మాట్లాడుతూ వైయస్సార్ కుటుంబానికి కదిరి అంటే ఎంతో అభిమానం అని తెలిపారు. రాష్ట్రంలోనే కదిరి నియోజకవర్గానికి అధికంగా నిధులు కేటాయించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ప్రతి ఎన్నికలోను వైఎస్ఆర్ సీపీకి పట్టణ ప్రజలు ఆదరిస్తున్నారని.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసీపీని ఆదరిం చాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థుల తో పాటు వైయస్సార్సీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.