BREAKING
ఇల్లందు రామ్‌దేవ్ బాబా మందిరంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు పాలకొండ లో ఉచిత ఆయుష్ వైద్య శిబిరం * జిల్లా ఆయుష్ వైద్యాధికారిణి డా. హేమాక్షి * చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమావేశం* ఆత్మీయ మిత్రుడు రోకటి ఇంటికి మంత్రి తుమ్మల చేతుల మీదుగా..‘ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల’కు భూమిపూజ - రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో. ​స్వర్గీయ సరోజిని ముఖర్జీ ఆదరణ కూడికకు హాజరైన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి బాధిత కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం పదో తరగతిలో 555 మార్కులు-గోపా ప్రతిభా పురస్కారం.- అంబాల మణికంఠ సాయికి ఘన సన్మానం. ఎంపీటీసీ ఎన్నికలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల వచ్చే విజయదశమి నాటికి జూలూరుపాడు టన్నెల్‌ పూర్తి చేయాలి -మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శి లో వైసీపీ నామినేషన్ తిరస్కరణ. వైసీపీ అభ్యర్థులు వీరే పూలను పూజించే గొప్ప వేడుక బతుకమ్మ పండుగ : నందికంటి శ్రీధర్ 'పీఠ'ముడి వీడుతున్నట్టేనా! *కొలిక్కివస్తున్న 'సర్దుబాటు' చర్చలు.. ఘనంగా...సద్దుల బతుకమ్మ వేడుక

కావలి పురపాలక సంఘంలో వైభవంగా 'ఆయుధ పూజ'

Select Suryaa Now
కావలి పురపాలక సంఘంలో వైభవంగా 'ఆయుధ పూజ'

​కావలిమేజర్ న్యూస్ :   కావలి పురపాలక సంఘం కార్యాలయంలో 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమంలో భాగంగా విజయదశమి (దసరా) పండుగను పురస్కరించుకొని పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో ఆయుధ పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గౌరవ పురపాలక సంఘ కమిషనర్  ఎస్.డి. అబ్దుల్ రషీద్  పర్యవేక్షణలో ఈ కార్యక్రమం కొనసాగింది. ​ఈ సందర్భంగా పట్టణ పరిశుభ్రతకు నిరంతరం ఉపయోగించే పారిశుద్ధ్య వాహనాలు, పనిముట్లకు పూలమాలలు వేసి, శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

​పట్టణ పరిశుభ్రతే ధ్యేయం :  ​కమిషనర్ ఎస్.డి. అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ, దసరా పండుగ వేళ పారిశుద్ధ్య కార్మికులు మరియు సిబ్బంది సేవలను అభినందించారు. స్వచ్ఛతా హీ సేవా పిలుపులో భాగంగా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య పరికరాలు ఎంతో కీలకమని, వాటికి పూజలు నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రజలందరూ చెత్తను రోడ్డుపై వేయకుండా, మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించి కావలిని స్వచ్ఛ కావలిగా మార్చాలని కోరారు.  ​ఈ ఆయుధ పూజ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.డి. అబ్దుల్ రషీద్‌తో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ ఎమ్.డి. బషీర్, శానిటరీ ఇన్స్పెక్టర్ స్వర్ణ, వివిధ వార్డుల శానిటేషన్ కార్యదర్శులు, శానిటరీ మేస్త్రీలు మరియు పారిశుద్ధ్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.