BREAKING
ఫ్రాన్స్‌లో ముదురుతున్న సంక్షోభం వైసీపీ హయాంలోనే నగర అభివృద్ధి సాధ్యం పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్‌బాబును కలిసి విజ్ఞప్తి చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ కు ఏర్పాట్లు పూర్తి ... - జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి - ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలి --- జీవో 1195పై పునఃసమీక్ష చేయాలి.. ---ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి — బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు 13వ డివిజన్ కార్పొరేటర్ గా కొట్టే రుక్మిణమ్మ ఏకగ్రీవం మాటెల్ కొత్త సీఎఫ్‌వోగా పీటర్ గ్రిఫిత్ నియామకం అన్నపూర్ణా దేవి అమ్మవారికి కుంకుమ తొ అభిషేకం జాతీయ స్థాయికి పూడిపర్తి బయాలజీ టీచర్ ప్రాజెక్టు సైలెన్స్ థెరప్యూటిక్స్‌ను కొనుగోలు చేసిన జర్మనీ దిగ్గజం మెర్క్ ఏపీ హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ను కలిసిన పల్లెటి వెంకటేష్ నాయుడు.. పెంచలకోనలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు 10 లక్షల కరెన్సీ తో జగన్మాత దర్శనం ప్రముఖ హాలీవుడ్ నటుడు రస్సెల్ బ్రాండ్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎన్నికల విధులకు సన్నద్ధం కావాలి :ఆర్వో

చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమావేశం*

Select Suryaa Now
చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమావేశం*

హైదరాబాద్: రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమితి ఆధ్వర్యంలో, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఏఐసీసీ నాయకులు గిడుగు రుద్రరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు,  కార్యదర్శి జి.అనంద్  కాంగ్రెస్ నాయకులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా *టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ*...రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగధనుడని కొనియాడారు. చార్మినార్‌తో రాజీవ్ గాంధీకి విడదీయలేని అనుబంధం ఉందని పేర్కొన్నారు.

18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదే అని, నేడు దేశ ప్రజలు మొబైల్ ఫోన్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవడంలో ఆయన దూరదృష్టి కీలక పాత్ర పోషించిందని అన్నారు. ప్రజలకు వైద్య సేవలందిస్తూ వారి మనసులను గెలుచుకున్న మల్లికార్జున గారిని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

కాంగ్రెస్ పార్టీ చరిత్ర త్యాగాలతో ముడిపడి ఉందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. దేశం కోసం తన ప్రతి రక్తపు బొట్టును ధారపోస్తానని చెప్పిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ, ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన సోనియా గాంధీ వంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఆదర్శమని అన్నారు.

దేశ స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామ్యం లేని బీజేపీ నేడు దేశభక్తి గురించి పాఠాలు చెబుతోందని విమర్శించారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ వంటి మహనీయుల చరిత్రను ప్రజల మదిలో నుంచి చెరిపివేసేందుకు, చరిత్రను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్రను యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

దేశం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటోంది: దేశంలో శాశ్వతంగా అధికారంలో కొనసాగాలనే లక్ష్యంతో కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని, రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మతం, కులం పేరుతో ఓటర్ల జాబితాల నుంచి ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.

దేశం కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు ఒక్క చుక్క రక్తమైనా ధారపోశారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాలకు ప్రతీక అని స్పష్టం చేశారు.

పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి  కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.