పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్‌బాబును కలిసి విజ్ఞప్తి చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులు
వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్ పట్టణానికి విచ్చేసిన పత్తికొండ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) కేఈ శ్యామ్‌బాబును సోమవారం ఆర్యవైశ్య సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను బహూకరించారు. అనంతరం వారు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, తద్వారా సముదాయానికి మరింత న్యాయం జరుగుతుందని విజ్ఞప్తి చేశారు. నాయకుల విజ్ఞటనపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. అందరితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు తిరువీధి రమేష్ శెట్టి, తిరువీధి రాంప్రసాద్, తిరువీధి సుధీంద్ర తదితరులు పాల్గొన్నారు సూర్య ప్రతినిధి షేక్ దస్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం