మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్
పెడన,మేజర్ న్యూస్ : మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ కు
టీడీపీ బీ-ఫారం అందజేసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. ఈ సందర్భంగా ఫణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో మండలాన్ని అభివృద్ధి బాటన నడిపిస్తానని హామీ ఇస్తున్నాను అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరితోను సౌమ్యంగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తున్న పనికి అఖండ విజయం చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు శలపాటి ప్రసాద్, అర్జా వెంకట నగేష్, శీరం ప్రసాదు, మండల టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.