85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం
విజయవాడ సెంట్రల్, మేజర్ న్యూస్: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 85వ డివిజన్ పాత రాజీవ్ నగర్, ఉడా కాలనీలో మంగళవారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వట్టే వెంకటేశ్వరరావు గెలుపు కోసం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని, డివిజన్ అభివృద్ధిని వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వట్టే చందు, డివిజన్ ఇన్‌చార్జి మోతుకూరి ఖాసీం, మాజీ కార్పొరేటర్ మోదుగుల గణేష్, బూత్ ఇన్‌చార్జిలు, మహిళా నాయకులు, మైనారిటీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, కూటమి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.