వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ
పార్వతీపురం, అక్టోబర్ 20, మేజర్ న్యూస్ :
పార్వతీపురం మండలం చినబొండపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గండి శంకర్రావు, సంగంవలస గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కోడి వెంకటనాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు.పార్వతీపురం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమక్షంలో వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని, పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న కృషిని చూసి టీడీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.