13వ డివిజన్ కార్పొరేటర్ గా కొట్టే రుక్మిణమ్మ ఏకగ్రీవం
తిరుపతి, మేజర్ న్యూస్:;తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఎమ్మార్ పల్లి 13 డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గా కొట్టే రుక్మిణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెతో పాటు మరో ఇద్దరు వైసిపి పార్టీకి చెందిన మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో ఒకరు అఫిడవిట్ సమర్పించకపోవడంతో వారి నామినేషన్ ను పరిశీలనలో తిరస్కరించారు. అలాగే ఏ. కోమల అనే మహిళ మున్సిపల్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి కావడంతో ఆమె నామినేషన్ ను కూడా తిరస్కరించారు. దీంతో కొట్టే రుక్మిణమ్మ కార్పొరేటర్ గా ఏకగ్రీవమయ్యారు.
వ్యూహాలు రచించిన రుక్మిణమ్మ తనయుడు కొట్టే హేమంత్...
13వ డివిజన్ కార్పొరేటర్ రుక్మిణమ్మ తనయుడు కొట్టే హేమంత్ రాయల్ టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఉన్నారు. ఎంఆర్ పల్లి లోని 14 వ డివిజన్ తోపాటు 13వ డివిజన్ లో ఆయన తల్లిని ఏకగ్రీవం చేసుకోవడంలో వ్యూహాలు రచించి ఎట్టకేలకు ఏకగ్రీవం చేసుకున్నారు. ఏది ఏమైనా హేమంత్ రాయుల్ ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లలోని తప్పులను ఎత్తి చూపించి అధికారులు తిరస్కరించేలా ఎప్పటికప్పుడు వ్యూహాలు రచించి తను అనుకున్న విధంగా తన తల్లి రుక్మిణమ్మ ను కార్పొరేటర్ గా ఏకగ్రీవం చేసుకోవడంతో పాటు మరో ఒక ఎస్సి కార్పొరేటర్ ను కూడా ఏకగ్రీవం చేసుకోవడంలో కొట్టే హేమంత్ రాయల్ కీలకంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశంతో పాటు జనసేన, బిజెపి నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.
H. Dwaraka, staff reporter, tpt.
Cell no : 9705347341