BREAKING
జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ కు ఏర్పాట్లు పూర్తి ... - జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి - ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలి --- జీవో 1195పై పునఃసమీక్ష చేయాలి.. ---ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి — బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు 13వ డివిజన్ కార్పొరేటర్ గా కొట్టే రుక్మిణమ్మ ఏకగ్రీవం మాటెల్ కొత్త సీఎఫ్‌వోగా పీటర్ గ్రిఫిత్ నియామకం అన్నపూర్ణా దేవి అమ్మవారికి కుంకుమ తొ అభిషేకం జాతీయ స్థాయికి పూడిపర్తి బయాలజీ టీచర్ ప్రాజెక్టు సైలెన్స్ థెరప్యూటిక్స్‌ను కొనుగోలు చేసిన జర్మనీ దిగ్గజం మెర్క్ ఏపీ హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ను కలిసిన పల్లెటి వెంకటేష్ నాయుడు.. పెంచలకోనలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు 10 లక్షల కరెన్సీ తో జగన్మాత దర్శనం ప్రముఖ హాలీవుడ్ నటుడు రస్సెల్ బ్రాండ్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎన్నికల విధులకు సన్నద్ధం కావాలి :ఆర్వో పలమనేరు మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్ల పరిశీలన పూర్తి ప్రభుత్వ విప్ గణబాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి పోలాండ్‌లో గూఢచర్యం తీవ్ర కలకలం

పదో తరగతిలో 555 మార్కులు-గోపా ప్రతిభా పురస్కారం.- అంబాల మణికంఠ సాయికి ఘన సన్మానం.

Select Suryaa Now
పదో తరగతిలో 555 మార్కులు-గోపా ప్రతిభా పురస్కారం.- అంబాల మణికంఠ సాయికి ఘన సన్మానం.

సూర్య,టేకులపల్లి,పదో తరగతిలో 555 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన టేకులపల్లి మండలం కుంటల్ల గ్రామానికి చెందిన అంబాల మణికంఠ సాయి గోపా ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నట్లు సోమవారం తెలిపారు. గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మంలోని లయన్స్ క్లబ్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో మణికంఠ సాయిని శాలువాతో ఘనంగా సత్కరించినట్లు తెలిపారు.

కుంటల్ల గ్రామానికి చెందిన అంబాల మాధురి, మోహన్ బాబు దంపతుల కుమారుడైన, మణికంఠ సాయి పదో తరగతిలో 555 మార్కులు సాధించి,తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా గోపా ప్రతినిధులు అతడికి శాలువా కప్పి, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు.

గౌడ విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని, గోపా ప్రతినిధులుపదో తరగతిలో 555 మార్కులు సాధించడం అభినందనీయమన్నారు. మణికంఠ సాయి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, ఇతర గౌడ విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో విద్యాభివృద్ధికి దోహదపడవచ్చని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు, గురువులకే అంకితం

పురస్కారం అందుకున్న మణికంఠ సాయి మాట్లాడుతూ,ఈ అవార్డు తన ఒక్కడిదే కాదని, తనను కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు కూడా చెందుతుందని తెలిపారు. గోపా అందించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరచిపోనని పేర్కొన్నాడు. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో కష్టపడి చదివి గౌడ సమాజానికి మంచి పేరు తీసుకొస్తానని తెలిపారు. గోపా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థి తల్లిదండ్రులు, గౌడ సంఘం నాయకులు, కులస్తులు  మణికంఠ సాయికి అభినందనలు తెలిపారు.

సూర్య రిపోర్టర్ దస్రు టేకులపల్లి