BREAKING
అన్నపూర్ణా దేవి అమ్మవారికి కుంకుమ తొ అభిషేకం జాతీయ స్థాయికి పూడిపర్తి బయాలజీ టీచర్ ప్రాజెక్టు సైలెన్స్ థెరప్యూటిక్స్‌ను కొనుగోలు చేసిన జర్మనీ దిగ్గజం మెర్క్ ఏపీ హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ను కలిసిన పల్లెటి వెంకటేష్ నాయుడు.. పెంచలకోనలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు 10 లక్షల కరెన్సీ తో జగన్మాత దర్శనం ప్రముఖ హాలీవుడ్ నటుడు రస్సెల్ బ్రాండ్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎన్నికల విధులకు సన్నద్ధం కావాలి :ఆర్వో పలమనేరు మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్ల పరిశీలన పూర్తి ప్రభుత్వ విప్ గణబాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి పోలాండ్‌లో గూఢచర్యం తీవ్ర కలకలం తెదేపాలోకి వైకాపా నాయకులు జంప్...!! మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు దండా బత్తుల నరేష్* ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త విప్లవం శివశంకర్ రాజీనామాపై కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం

ఎంపీటీసీ ఎన్నికలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల

Select Suryaa Now
ఎంపీటీసీ ఎన్నికలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల

గరుగుబిల్లి, సూర్య : ఎంపీటీసీ ఎన్నికలకు సంబం ధించి మండల ఎన్నికల అధికారి ఎం వాణిశైలజ సోమవారం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ మేరకు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆవరణలోని నోటీస్ బోర్డ్ లో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్ ను అతికించారు.ఈసందర్భంగా ఎన్నికల అధికారి ఎం వాణిశైలజ మాట్లాడుతూ ఎంపీటీసీ ఎన్నికల్లో భాగముగా ఎంపీటీసీలుగా పోటీ చేసే అభ్యర్థుల నుండి బుధవారం నుంచి 23వ తేదీ వరకు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంకాలం ఐదు గంటల వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. 24వ తేదీన ఎంపీటీసీ అభ్యర్థులకు సంబంధించి వచ్చిన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుందన్నారు. 25వ తేదీన నామినేషన్ ఫారాలలో ఏమైనా తప్పిదాలు జరిగి తిరస్కరిం చిన నామినేషన్లపై అప్పీలు చేసుకోవ చ్చన్నారు.అదే 26వ తేదీన ఎన్నికల అధికారి తిరస్కరణ నామినేషన్ల పై తుది నిర్ణయం ఉంటుందన్నారు.27వ తేదీన పోటీ బరిలో ఉండ దలుచుకో లేని అభ్యర్థులు తమ నామినేషన్లను ఉప సంహరించుకోవచ్చన్నారు.అదే విధంగా 27వ తేదీ సాయంకాలం ఎంపీటీసీ జడ్పిటిసి పదవులకు పోటీ చేయు అభ్యర్థుల పేర్లు నోటీసు బోర్డు లో ప్రకటన చేయడం జరుగుతుందని తెలిపారు.వచ్చే నెల మూడవ తేదీన ఎంపీటీసీ మరియు జడ్పిటిసి ఎన్నికల కు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఐదవ తేదీన ఎంపీటీసీ మరియు జడ్పిటిసి ఓట్ల లెక్కింపు తదుపరి ఫలితాలను ప్రకటించడం జరుగుతుం దని అనంతరం గెలుపొందిన వారికి ఎన్నికల అధికారిచే ధ్రువీకరణ పత్రము అందజేయడం జరుగుతుందని ఎన్నికల అధికారి ఎం వాణిశైలజ పేర్కొ న్నారు.ఈకార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి నడిమింటి సూర్యనారాయణ,మండల తహసిల్దార్ పాము బాల, ఎంపీడీవో కార్యాలయ ఏ ఓ నాలి అర్జునరావు,డిప్యూటీ ఎంపీడీవో మరడాన వెంకటేశ్వరరావు, కార్యాలయ సిబ్బంది బెంకిలి శ్రీనివాస రావు ఎన్ కులశేఖర్, గుంట్రేడ్డి కృష్ణప్రసాద్, అలజంగి శ్రీకాంత్, గంట విజయలక్ష్మి,డాకోజు సూర్యప్రభాకర్, గంట రామినాయుడు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.