BREAKING
ఫ్రాన్స్‌లో ముదురుతున్న సంక్షోభం వైసీపీ హయాంలోనే నగర అభివృద్ధి సాధ్యం పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్‌బాబును కలిసి విజ్ఞప్తి చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ కు ఏర్పాట్లు పూర్తి ... - జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి - ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలి --- జీవో 1195పై పునఃసమీక్ష చేయాలి.. ---ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి — బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు 13వ డివిజన్ కార్పొరేటర్ గా కొట్టే రుక్మిణమ్మ ఏకగ్రీవం మాటెల్ కొత్త సీఎఫ్‌వోగా పీటర్ గ్రిఫిత్ నియామకం అన్నపూర్ణా దేవి అమ్మవారికి కుంకుమ తొ అభిషేకం జాతీయ స్థాయికి పూడిపర్తి బయాలజీ టీచర్ ప్రాజెక్టు సైలెన్స్ థెరప్యూటిక్స్‌ను కొనుగోలు చేసిన జర్మనీ దిగ్గజం మెర్క్ ఏపీ హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ను కలిసిన పల్లెటి వెంకటేష్ నాయుడు.. పెంచలకోనలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు 10 లక్షల కరెన్సీ తో జగన్మాత దర్శనం ప్రముఖ హాలీవుడ్ నటుడు రస్సెల్ బ్రాండ్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎన్నికల విధులకు సన్నద్ధం కావాలి :ఆర్వో

కార్పొరేషన్ లో నామినేషన్ల పరిశీలన

Select Suryaa Now
కార్పొరేషన్ లో నామినేషన్ల పరిశీలన

విజయనగరం, సూర్య : నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియలో మరో అంకం పూర్తయింది. మూడు రోజుల పాటు సాగిన నామినేషన్ల స్వీకరణలో వచ్చిన 450 వార్డు సభ్యుల నామినేషన్లు, 23 మేయర్ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఈరోజు చేపట్టారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉన్న మొదటి, రెండవ అంతస్థులలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియను చేపట్టారు. 17 కౌంటర్లలో రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల సమక్షంలో నామినేషన్లను పరిశీలించారు. సరైన ధృవపత్రాలు జతపరచని నలుగురు నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో 447 మంది వార్డు సభ్యుల నామినేషన్లు, 22 మంది మేయర్ అభ్యర్థుల నామినేషన్లు సక్రమమైనవిగా గుర్తించారు. సక్రమంగా నామినేషన్ వేసిన అభ్యర్థులు ఉపసంహరించుకునేందుకు ఈనెల 21 వరకు ఎన్నికల సంఘం గడువు ఇచ్చిన విషయం విదితమే. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అదేరోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నట్లు కమిషనర్ బాలస్వామి తెలిపారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను ఎన్నికల అధికారి తేజ్ భరత్ పరిశీలించారు. 12వ వార్డుకు సంబంధించి కొర్రాయి జగదీష్, 30 వ వార్డు కు సంబంధించి గేయామృత, 50వ వార్డుకు సంబంధించి మత్స భవాని సక్రమమైన ధ్రువపత్రాలు అందజేయని కారణంగా వాటిని తిరస్కరించారు. అలాగే మేయర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గేయామృత అఫిడవిట్ అందజేయని కారణంగా ఆమె నామినేషను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.