పాలకొండ లో ఉచిత ఆయుష్ వైద్య శిబిరం * జిల్లా ఆయుష్ వైద్యాధికారిణి డా. హేమాక్షి *
పాలకొండ, సూర్య : దీర్ఘకాలిక మరియు కాలానుగున రుగ్మతలకు ఆయుష్ వైద్యం ఉపశమనంతో పాటు, మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తుందని జిల్లా ఆయుష్ వైద్యాధికారిణి డాక్టర్ టి. హేమాక్షి అన్నారు. సోమవారం పాలకొండ, శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవస్థానం వద్ద హోమియో వైద్యాధికారిణి డా. పావని విద్మహే తో కలసి ఉచిత ఆయుష్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వివిధ దీర్ఘకాలిక మరియు కాలానుగున రుగ్మతలకు వారు తనిఖీలు జరిపి పరీక్షించారు. అవసరమైన ఆయుర్వేద, హోమియో మందులు అందజేసి వినియోగించే విధానాన్ని , వాటి ప్రయోజనాలను వివరించారు. అనేక మంది ఆయుష్ సేవలు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా డా. హేమాక్షి మాట్లాడుతూ ఆయుష్ వైద్యంతో దీర్ఘకాలిక రుగ్మతలతో ఉన్న ఎంతో మంది ప్రయోజనం పొందుతున్నారని, అలాగే కాలానుగున ఆరోగ్య సమస్యలకు మంచి ఉపశమనాన్ని కలిగిస్తుందని, రోగనిరోధక వ్యవస్థ బలపడి ఆరోగ్యం మెరుగవుతుందని తెలిపారు. ప్రాచీన కాలం నుండి మన దేశ ఆయుర్వేద వైద్యం ఎంతో ప్రాచుర్యం పొందిందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గారు, ఆయుష్ ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు ఆయుష్ వైద్యం మరింత చేరువ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ ఏఎన్ఎమ్ పద్మ , సిబ్బంది పద్మ, రమేష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : రమణ మూర్తి నాయుడు, పాలకొండ, పార్వతీపురం మన్యం.