BREAKING
జాతీయ స్థాయికి పూడిపర్తి బయాలజీ టీచర్ ప్రాజెక్టు సైలెన్స్ థెరప్యూటిక్స్‌ను కొనుగోలు చేసిన జర్మనీ దిగ్గజం మెర్క్ ఏపీ హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ను కలిసిన పల్లెటి వెంకటేష్ నాయుడు.. పెంచలకోనలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు 10 లక్షల కరెన్సీ తో జగన్మాత దర్శనం ప్రముఖ హాలీవుడ్ నటుడు రస్సెల్ బ్రాండ్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎన్నికల విధులకు సన్నద్ధం కావాలి :ఆర్వో పలమనేరు మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్ల పరిశీలన పూర్తి ప్రభుత్వ విప్ గణబాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి పోలాండ్‌లో గూఢచర్యం తీవ్ర కలకలం తెదేపాలోకి వైకాపా నాయకులు జంప్...!! మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు దండా బత్తుల నరేష్* ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త విప్లవం శివశంకర్ రాజీనామాపై కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియకు బందోబస్తు పరిశీలన

వైసీపీ అభ్యర్థులు వీరే

Select Suryaa Now
వైసీపీ  అభ్యర్థులు వీరే

విజయనగరం, సూర్య : సోమవారం నాడు శాసనసభ మాజీ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి  నివాసంలో వైసిపి మండల పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. రానున్న 21,22,23 తారీకులలో ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 12 ఎంపీటీసీ స్థానాలకు గాను నిర్వహించిన సమావేశంలో 9 మంది వైసిపి ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. దుప్పాడ గ్రామం నుండి కేల్ల కృష్ణవేణి, జొన్నవలస గ్రామం నుండి కంటి రమాదేవి, గొల్లల పేట గ్రామం నుండి బోర తులసి, కొండకరకం గ్రామం నుండి జాగారపు భాస్కరరావు, ద్వారపూడి గ్రామం నుండి ఆల్తి వీర వెంకట సత్యనారాయణ, చెల్లూరు గ్రామం నుండి బోద దేవి, సారిక గ్రామం నుండి గంగిరెడ్ల సూర్యప్రకాష్, గుంకలం గ్రామం నుండి కర్రోతు అక్కయమ్మ, కొండకరకాం గ్రామం నుండి భోగాపురపు ఆదినారాయణ లను ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ వైసీపీ విజయమే ధ్యేయంగా కృషి చేయాలని కోరారు. గత వైసీపీ హయాంలో ఇప్పటి కూటమి ప్రభుత్వ పాలనాలలో నిత్యవసర సరుకుల ధరల వ్యత్యాసాలను గమనించాలని సూచించారు. సంక్షేమ పథకాలు అమలు తీరును గమనించాలని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకుని వచ్చే బాధ్యత మీ అందరిపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ మామిడి అప్పలనాయుడు, మండల అధ్యక్షులు కెల్ల త్రినాధ్, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు డోల మన్మధ కుమార్, మాజీ  ఎంపీటీసీ, జడ్పిటిసిలు, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.