BREAKING
ఫ్రాన్స్‌లో ముదురుతున్న సంక్షోభం వైసీపీ హయాంలోనే నగర అభివృద్ధి సాధ్యం పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్‌బాబును కలిసి విజ్ఞప్తి చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ కు ఏర్పాట్లు పూర్తి ... - జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి - ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలి --- జీవో 1195పై పునఃసమీక్ష చేయాలి.. ---ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి — బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు 13వ డివిజన్ కార్పొరేటర్ గా కొట్టే రుక్మిణమ్మ ఏకగ్రీవం మాటెల్ కొత్త సీఎఫ్‌వోగా పీటర్ గ్రిఫిత్ నియామకం అన్నపూర్ణా దేవి అమ్మవారికి కుంకుమ తొ అభిషేకం జాతీయ స్థాయికి పూడిపర్తి బయాలజీ టీచర్ ప్రాజెక్టు సైలెన్స్ థెరప్యూటిక్స్‌ను కొనుగోలు చేసిన జర్మనీ దిగ్గజం మెర్క్ ఏపీ హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ను కలిసిన పల్లెటి వెంకటేష్ నాయుడు.. పెంచలకోనలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు 10 లక్షల కరెన్సీ తో జగన్మాత దర్శనం ప్రముఖ హాలీవుడ్ నటుడు రస్సెల్ బ్రాండ్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎన్నికల విధులకు సన్నద్ధం కావాలి :ఆర్వో

ఇల్లందు రామ్‌దేవ్ బాబా మందిరంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
ఇల్లందు రామ్‌దేవ్ బాబా మందిరంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

 సూర్య,ఇల్లందు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ఇల్లందు పట్టణంలోని రామ్‌దేవ్ బాబా ఆలయం, మార్వాడి సత్రం ప్రాంగణంలో కమిటీ చైర్మన్ సునీల్ తోతుల, ప్రధాన కార్యదర్శి నారాయణదాసులాహుటి లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై వారికున్న ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే బతుకమ్మ సంబరాలు భక్తి, ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి. ఈ వేడుకలతో ఆలయ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పే పండుగల్లో బతుకమ్మకు విశిష్ట స్థానం ఉంది. ప్రకృతిలో లభించే వివిధ రకాల రంగురంగుల పూలను సేకరించి, వాటిని అందంగా పేర్చి బతుకమ్మను రూపొందించడం ఈ పండుగ ప్రత్యేకత. పూలనే దేవతా స్వరూపంగా భావించి పూజించడం తెలంగాణ ప్రజల ప్రకృతి ఆరాధనకు నిదర్శనం. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం నేటికీ అదే ఉత్సాహంతో కొనసాగుతోంది.

ఇల్లందు పట్టణంలోని రామ్‌దేవ్ బాబా ఆలయం మార్వాడి సత్రంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను తీసుకొచ్చారు. వాటిని ఒకచోట ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. మహిళల ఆటపాటలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.

చిన్నారులు సైతం వేడుకల్లో పాల్గొని బతుకమ్మ ఆటలను ఆసక్తిగా తిలకించారు. పెద్దలు సంప్రదాయాలను వివరిస్తూ, భావితరాలకు వాటి విశిష్టతను తెలియజేశారు.

ఇల్లందు పట్టణంలోనూ బతుకమ్మ పండుగకు ప్రజలు విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు. పండుగ సందర్భంగా ఆలయాలు, వివిధ సామాజిక వేదికలు వేడుకలకు కేంద్రాలుగా మారుతున్నాయి. రామ్‌దేవ్ బాబా ఆలయం మార్వాడి సత్రంలో నిర్వహించిన ఈ బతుకమ్మ కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ సునీల్ తొత్ల , ప్రధాన కార్యదర్శి నారాయణదాసు లహుటి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

సూర్య రిపోర్టర్ రాజేష్ ఇల్లందు