స్వర్గీయ సరోజిని ముఖర్జీ ఆదరణ కూడికకు హాజరైన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి
కావలిమేజర్ న్యూస్ : కావలి పట్టణ పరిధిలోని కచ్చేరి మిట్ట నివాసి స్వర్గీయ సరోజిని ముఖర్జీ జ్ఞాపకార్థం సోమవారం నిర్వహించిన 'ఆదరణ కూడిక' (జ్ఞాపకార్థ ప్రార్థన సమవేశం) కార్యక్రమంలో కావలి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సరోజిని ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సానుభూతి తెలిపారు. ఈ ఆదరణ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి పట్టణాధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజానీకం పెద్ద సంఖ్యలో హాజరై సరోజిని ముఖర్జీకి నివాళులర్పించారు.