దర్శి లో వైసీపీ నామినేషన్ తిరస్కరణ.
సూర్య న్యూస్ దర్శి.
మున్సిపల్ ఎన్నికలు సంబంధించి చైర్మన్ , కౌన్సిలర్ల పదవులకు 73 మంది నామినేషన్లో దాఖలు చేశారు. అందులో రెండు వార్డులకు పోటీ చేసిన కౌన్సిలర్ ల నామినేషన్ తిరస్కరణకు గురయ్యాయి. 19 20 వార్డు కౌన్సిలర్ల నామినేషన్లు అధికారులు తిరస్కరించారు. సరైన పత్రాలు అందచేయకపోవడంతో ఇరువురు నామినేషన్ తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. 19వ వార్డులో కౌన్సిలర్ గా పోటీ చేసిన బత్తుల స్నేహలత, 20వ వార్డులో కౌన్సిలర్ గా వైసీపీ తరఫునపోటీ చేసిన శ్రీరామ్ మరియమ్మ నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. చైర్మన్ కు వార్డులకు సంబంధించి 71 మంది నామినేషన్ లు ఆమోదయోగ్యమైనట్లుఅధికారులు తెలిపారు.