కాట్రేనికోనలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన.. వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు..
కాట్రేనికోన మేజర్ న్యూస్ మండలంలో ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులుదాట్ల సుబ్బరాజు బుచ్చిబాబుఆదివారం సుడిగాలి పర్యటన చేశారు.పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పల్లంకుర్రు గ్రామంలో రూ. 80.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు.కందికుప్ప గ్రామంలో రూ. 34.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లతో పాటు వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించారు.
పల్లం గ్రామంలో వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించి, నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మను ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.
దొంతికుర్రు గ్రామంలో రూ. 89.35 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించడంతో పాటు, నూతనంగా మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
కాట్రేనికోన గ్రామంలో రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు కమ్ డ్రైన్ నిర్మాణ పనులను ప్రారంభిం అనంతరం వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం లో చేరిన కార్యకర్తలను కండువాలు కప్పి పార్టీ లో కి ఆహ్వానిచ్చారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా గ్రామాల్లో రహదారులు, తాగునీటి సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చెల్లి సురేష్, నడింపల్లి సుబ్బరాజు దాట్ల పవన్, నాగిడి నాగేశ్వరరావు,ఆకాశంశ్రీనివాస్,నడింపల్లి సుబ్బరాజు, ఓగూరు భాగ్యశ్రీ, విత్తనాల బుజ్జి,వంగ దుర్గబాబు,బండారు ఏసు, కముజురాంబాబు, సుంకర బుజ్జి, నల్లా వెంకటేశ్వరరావు, షేక్ రబ్బాని, వాసం శెట్టి రాజేశ్వరరావు, సర్వేశ్, పిఎస్ఎన్ రాజు, తదితరులు పాల్గొన్నారు