జ్యోతికి డాక్టరేట్
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ పరిశోధనా విద్యార్థిని చీర్ల కిరణ్ సతీమణి ఎంబి జ్యోతికి డాక్టరేట్ ప్రధానం చేసినట్లు సిఈ రాజమాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమె ప్రొఫెసర్ ఆర్.శివరామ్ ప్రసాద్, ప్రొఫెసర్ పి.మోహన్ రెడ్డి, ప్రొఫెసర్ ఎం.వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ డివి.రమణ ఆధ్వర్యంలో బెంగళూరు నగరంలోని మహిళా ఐటీ నిపుణుల పని-జీవిత సమతుల్యత అనే అంశంపై పరిశోధన చేశారు. ఇందుకుగాను ఆమెకు డాక్టరేట్ ప్రధానం చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంబి జ్యోతికి పలువురు అధ్యాపకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, వారి కుటుంబ సభ్యులు అభినందనలు తెలియజేశారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్