BREAKING
కామారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం. కె ఆర్ ఆర్ అటానమస్ డిగ్రీ కళాశాలకు ఎన్ సి సి యూనిట్ మంజూరు ప్రముఖ సింగర్ కనిక కపూర్ సంచలన నిర్ణయం.. భర్త గౌతమ్‌కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటన మాడ్గుల సింగిల్ విండో చైర్మన్ గా వై.వి గౌడ్ ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది రామాయణంపై వస్తున్న విమర్శలపై స్పందించిన నిర్మాత నమిత్ మల్హోత్రా.. హాలీవుడ్ స్థాయిలోనే అద్భుత దృశ్యకావ్యం వెల్దుర్తిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు: భారీ పోలీస్ బందోబస్తు బియ్యం నాణ్యత లో రాజీ పడొద్దు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై రణ్‌బీర్ కపూర్ కీలక వ్యాఖ్యలు.. మానవ స్పర్శకు ఎప్పటికీ సాటి రాదంటూ స్పష్టత ముగసిన ఉర్సు ఉత్సవాలు ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలి: బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కె.వి.ఆర్.. మండలంలో పర్యటించిన కలెక్టర్ గ్రామ వికాసానికి నాబార్డ్ నిధులు.. 10వడివిజన్ కార్పొరేటర్ గా రాణి ఘనవిజయం స్మార్ట్ కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

ముస్లింల విద్యాభివృద్ధికి ఎంఐఎం కృషి - నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్

Select Suryaa Now
ముస్లింల విద్యాభివృద్ధికి ఎంఐఎం కృషి - నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్

సూర్య - మానకొండూర్ : తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల విద్యా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు ఎంఐఎం పార్టీ విశేషంగా కృషి చేస్తోందని నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ అన్నారు. ఎంఐఎం అధినేత, బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రత్యేక కృషితోనే రాష్ట్రంలో మైనారిటీ గురుకులాల అంకురార్పణ జరిగిందని ఆయన గుర్తుచేశారు. బుధవారం మండల కేంద్రమైన మానకొండూర్ ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు 'సాలారే మిల్లత్ ఆల్ ఇన్ వన్ 2026' గైడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే 8, 9 తరగతుల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులను అందజేశారు. సిరిసిల్ల, గంభీరావుపేట, వేములవాడ ప్రాంతాల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు వీలుగా ఆయా నియోజకవర్గాల పార్టీ ప్రతినిధులకు గైడ్లను అప్పగించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు అత్యంత కీలకమైనవని, ఇందులో ఉత్తీర్ణులు కావడానికి సాలారే మిల్లత్ గైడ్ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో మాజీ ఎంపీ, దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 26 సంవత్సరాల క్రితం ఈ ఉచిత గైడ్ల పంపిణీని ప్రారంభించారని తెలిపారు. ఆయన ఆశయ సాధనలో భాగంగానే ప్రస్తుత పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీలు తెలుగు రాష్ట్రాల్లో ఉర్దూ భాషను బ్రతికించడం కోసం, ఉర్దూ మీడియం పాఠశాలల బలోపేతానికి అమోఘమైన కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.హైదరాబాద్ నగరవ్యాప్తంగా పేద ముస్లిం పిల్లల కోసం కార్పొరేట్ స్థాయిలో 20 పాఠశాలలను స్థాపించి, ప్రతి ఏటా 20 వేల మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్న ఘనత తమ పార్టీ నాయకత్వానిదేనన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత చదువులు చదవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్,మానకొండూర్ మస్జిద్ మాజీ అధ్యక్షుడు సిరాజుద్దీన్ పాషా,పార్టీ నాయకులు హాఫిజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ, అహ్మద్ మొహియుద్దీన్ బాబుజానీ, అబ్దుల్ గఫ్ఫార్, మెరాజోద్దీన్, అబ్దుల్లా ఖాన్, ఫసియుద్దీన్ ఖాలీద్, షాకిర్ నహ్ది, ఖమరొద్దీన్ షబ్బీర్, ఎజాజ్ ఖురేషీ, పాఠశాల ఉపాధ్యాయులు  విద్యార్థులు పాల్గొన్నారు.