రైతులు కొనుగోలు కేంద్రాలనే సద్వినియోగం చేసుకోవాలి- మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
సూర్య - మానకొండూర్: రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. మండల కేంద్రమైన మానకొండూర్ వ్యవసాయ మార్కెట్, ముంజంపల్లి, సదాశివపల్లి, జగ్గయ్యపల్లి గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మానకొండూర్,ముంజంపల్లి,సదాశివపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో, అలాగే జగ్గయ్యపల్లిలో హాకా ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తోందని, అన్నదాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ విజయ్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్ర చారి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేవెల్లి రాజలింగం, వైస్ చైర్మన్ రేమిడి శ్రీనివాస్ రెడ్డి, మానకొండూర్,ఊటూర్ పీఏసీఎస్ అధ్యక్షులు నాగిశెట్టి రాజయ్య,ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, పాకాల వందన రెడ్డి ,మర్రి ఓదెలు, రామిడి తిరుమల్ రెడ్డి,దూలం వీరస్వామి,సాయిరి దేవయ్య, రామాంజనేయులు, తోట శ్రీనివాస్, బుర్ర శ్రీధర్,రామినేని రమణ,ముక్కెర సతీష్, బుర్ర శ్రీకాంత్ గోపు శ్రీనివాస్ రెడ్డి ,మాశం రామకృష్ణ, కానిగంటి రమేష్, బండి సమ్మయ్య, బొంగోని సునీల్, ఎనగంటి శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు...