తిమ్మాపూర్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతి
తిమ్మాపూర్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతి
కందుకూరు :తిమ్మాపూర్ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డిని సర్పంచ్ గానుగుపేట అంజమ్మ, ఉప సర్పంచ్ సన్నీళ్ల సంధ్య నరేందర్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ తో కలిసి కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వెంటనే స్పందించి ఫ్యూచర్ సిటీ అథారిటీ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి గ్రామానికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆదేశించారని వారు పేర్కొన్నారు.అనంతరం మంత్రి తరఫున ఇచ్చిన లేఖను ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏఓకు అందజేశారు. దీనిపై ఏఓ సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ తెలిపారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్