BREAKING
భారీ రెమ్యునరేషన్ వచ్చినా కొత్త సినిమాలు ఒప్పుకోలేదు.. అసలు కారణం బయటపెట్టిన శ్రద్ధా కపూర్ కామారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం. కె ఆర్ ఆర్ అటానమస్ డిగ్రీ కళాశాలకు ఎన్ సి సి యూనిట్ మంజూరు ప్రముఖ సింగర్ కనిక కపూర్ సంచలన నిర్ణయం.. భర్త గౌతమ్‌కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటన మాడ్గుల సింగిల్ విండో చైర్మన్ గా వై.వి గౌడ్ ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది రామాయణంపై వస్తున్న విమర్శలపై స్పందించిన నిర్మాత నమిత్ మల్హోత్రా.. హాలీవుడ్ స్థాయిలోనే అద్భుత దృశ్యకావ్యం వెల్దుర్తిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు: భారీ పోలీస్ బందోబస్తు బియ్యం నాణ్యత లో రాజీ పడొద్దు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై రణ్‌బీర్ కపూర్ కీలక వ్యాఖ్యలు.. మానవ స్పర్శకు ఎప్పటికీ సాటి రాదంటూ స్పష్టత ముగసిన ఉర్సు ఉత్సవాలు ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలి: బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కె.వి.ఆర్.. మండలంలో పర్యటించిన కలెక్టర్ గ్రామ వికాసానికి నాబార్డ్ నిధులు.. 10వడివిజన్ కార్పొరేటర్ గా రాణి ఘనవిజయం

భీమిని మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన ప్రభుత్వ పాఠశాలలు, తహసీల్దార్ కార్యాలయం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన

Select Suryaa Now
భీమిని మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన  ప్రభుత్వ పాఠశాలలు, తహసీల్దార్ కార్యాలయం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన

సూర్య, భీమిని: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం భీమిని మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.ముందుగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) సందర్శించి విద్యార్థులకు అందుతున్న విద్యా, వసతి సౌకర్యాలను పరిశీలించారు.అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయ నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు.అనంతరం మల్లిడి గ్రామపంచాయతీని సందర్శించి గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు.అలాగే ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు.వారి అభ్యసన సామర్థ్యాన్ని, నైపుణ్యాలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు.అదేవిధంగా గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి కలెక్టర్ భూమిపూజ నిర్వహించారు.భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గ్రామ సర్పంచ్‌ను ఆదేశించారు. ఈ పర్యటనలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.