జోగులుకు మద్దతుగా కూనిశెట్టి ప్రచారం
పూసపాటిరేగ, నవంబరు 28, మేజర్ న్యూస్: గతంలో సర్పంచ్ గా పనిచేసిన డొప్ప జోగులను మరోసారి సర్పంచ్ గా గెలిపిస్తే కనిపెట్ట పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఎంపీటీసీ సభ్యురాలు రాజేశ్వరి భర్త, టిడిపి నాయకుడు కూనిసెట్టి గోవింద ప్రచార కార్యక్రమంలో ఓటర్లకు భరోసా ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గోవింద సర్పంచ్ అభ్యర్థి అయిన డొప్ప జోగులతో కలిసి భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమానికి భారీ ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఓటు యొక్క ప్రాధాన్యతను, ఆ ఓటు కష్టపడి పనిచేసే వారికి వినియోగిస్తే పంచాయితీ మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని గోవిందా వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో తన సతీమణి అయిన రాజేశ్వరుని గెలిపించారని, అయితే స్ఫూర్తితో సర్పంచులు కూడా డప్ప జోగులను గెలిపిస్తే పంచాయితీ డబల్ ఇంజిన్ సర్కార్ గా పనిచేస్తుందని ఈ సందర్భంగా గోవింద ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.