జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ వద్ద చింతచెట్టు ఆకస్మికంగా కూలింది
జంగారెడ్డిగూడెం, సూర్య న్యూస్ :- పాత బస్టాండ్ వద్ద శుక్రవారం సాయంత్రం కురిసిన పెనుగాలులు, వర్షంతో సుమారు 15 ఏళ్ల కాలం నాటి చింత చెట్టు ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఎవరికి ప్రాణపాయం జరగకపోయినా ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే వ్యాపారం చేసుకుంటున్న టిడిపి నాయకునికి చెందిన AP 37 03 4114 నెంబర్ గల మోటార్ సైకిల్ పై చెట్టు పడడంతో మోటార్ సైకిల్ పూర్తిగా ధ్వంసం అయింది. ఆ సమయంలో రోకపోకలు బంద్ అవ్వడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. చింత చెట్టు రోడ్డు కు అడ్డంగా పడడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రాకపోకలు బంద్ చేస్తూ ఆర్ అండ్ బి బంగ్లా సమీపంలో రెడ్ రిబ్బన్తో రాకపోకలు నిలిపివేశారు. అదేవిధంగా కోయిలగూడెం వైపు వెళ్లే వాహనాలు అన్నిటిని గంగానమ్మ గుడి మీదుగా గల బుట్టాయిగూడెం రోడ్డు వైపుకు మళ్ళించారు సమాచారం తెలుసుకున్న వెంటనే మున్సిపల్ కమిషనర్ కే వెంకటరమణ ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావులు దగ్గర ఉండి చెట్టును నరికించి ట్రాఫిక్ క్లియర్ చేశారు సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది ఇది ఇలా ఉండగా ఆ చింత చెట్టుకు ఆనుకుని ఉన్న ఒక కాఫీ హోటల్ ఫర్నిచర్ చాలా వరకు ధ్వంసం అయింది
రిపోర్టర్ రమణారావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా,