BREAKING
మనసును హత్తుకునేలా మనోజ్ వాజ్ పేయ్ 'దిల్వాలి దివాలి' మూవీ.. నెట్‌ఫ్లిక్స్‌లో ఆకట్టుకుంటున్న ఫ్యామిలీ డ్రామా! బియ్యం ధరల దోపిడీపై తెలంగాణ ప్రభుత్వ ఉక్కుపాదం: రాష్ట్రవ్యాప్తంగా దాడులు – 370 కేసులు నమోదు జిల్లాకేంద్రంలో నిర్మల్ జిల్లా ఆర్ఎంపీ ల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక : పదోతరగతివిద్యార్థులకు ఉచితంగా అన్ని అంశాల చదువు పుస్తకాల పంపిణీ పెండింగ్ పనుల్లో జాప్యం చేయొద్దు సోలక్ పల్లి లో ఉచిత వైద్య శిబిరం కోదాడ నియోజకవర్గంలో 219 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. తుఫాన్ బాధితులకు అండగా ప్రభుత్వం. ఎల్లంపేట మున్సిపాలిటీలో అంపశయ్యపై సమాచార హక్కు చట్టం.. మూడుసార్లు దరఖాస్తు చేసినా సమాచారం ఏదీ..? రైల్వే గేటు పడితే ట్రాఫిక్ కష్టాలే.. కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు అక్బర్జపేట్‌లో హరితహారం మొక్కల విధ్వంసం.. 150కి పైగా మొక్కలు ధ్వంసమైనా పట్టించుకునేవారేరి..? ఎంపీ సురేష్ కుమార్ షట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కోహిర్ మండల కాంగ్రెస్ నాయకులు వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత క్రెడిట్ సొసైటీ మేనేజర్ మృతి పై విచారణ జరపాలి కారు బైకు ఢీ తండ్రి మృతి కొడుకుకి తీవ్ర గాయాలు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ భవితవ్యం తేలేది నేడే .... చీపురుపల్లి లో పోలింగ్ 76.79 శాతం... ...... జెడ్పీటీసీ కి త్రిముఖ పోటీ......

Select Suryaa Now
జెడ్పీటీసీ, ఎంపీటీసీ భవితవ్యం తేలేది నేడే .... చీపురుపల్లి లో పోలింగ్  76.79 శాతం... ...... జెడ్పీటీసీ కి త్రిముఖ పోటీ......

చీపురుపల్లి మేజర్ న్యూస్:

మండలంలో శుక్రవారం జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల  ఎన్నికల కౌంటింగ్ లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. గరివిడి ఎస్ డిఎస్ కళాశాలలో జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండలంలో 49,469 మంది ఓటర్లకు గాను  37,989 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. టీడీపీ నుంచి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, వైసీపీ నుంచి బెల్లాన వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నుంచి నాగులపల్లి పైడిరాజు పోటీలో ఉన్నారు.  18 ఎంపీటీసీ స్థానాలకు 40 మంది అభ్యర్థులు టీడీపీ, జనసేన,  వైసీపీ, స్వతంత్ర అభ్యర్థులు   పోటీలో ఉన్నారు.  చీపురుపల్లి 1 అభ్యర్థిగా ఇజ్జిరోతు నిహారిక (టీడీపీ), వైసీపీ నుంచి మహంతి లక్ష్మీ, చీపురుపల్లి 2 రేగాన శాంతి ప్రియ (టీడీపీ), సబ్బి సోనియా (స్వతంత్ర టీడీపీ రెబల్ అభ్యర్థి), అడ్డూరి కృష్ణారావు (వైసీపీ), చీపురుపల్లి 3 మీసాల కాశీ విశ్వేశ్వరరావు (టీడీపీ), ముల్లు పైడిరాజు (వైసీపీ),  చీపురుపల్లి 4 నుంచి గవిడి నాగరాజు (టీడీపీ), ఇప్పిలి అనంతం (వైసీపీ), వంగపల్లి పేటలో వెంపడాపు హైమవతి (టీడీపీ), వెంపడాపు వెంకటరత్నం (వైసీపీ), చీపురుపల్లి 6 నుంచి కోట్ల కృష్ణ (జనసేన), కోసిరెడ్డి రమణ (వైసీపీ), రామలింగాపురం సారిక రామారావు (టీడీపీ), ఇప్పిలి వెంకట నర్సమ్మ (వైసీపీ), కర్లం నుంచి బాణాన రమణ (వైసీపీ), పొన్నాడ మహేశ్వరరావు (టీడీపీ), పేరిపి లో కోరాడ కోటేశ్వరరావు (టీడీపీ), లెంక రాజారావు (వైసీపీ), కరకాం నుంచి దన్నాన పద్మావతి (టీడీపీ), మీసాల వెంకటరమణ (వైసీపీ), నిమ్మలవలసలో పినిపిల్లి సుజాత (టీడీపీ), పెంట ముగతమ్మ (వైసీపీ), రావివలస నుంచి శనపతి నవ్య (టీడీపీ), కొమ్ము పద్మజ (వైసీపీ), ఇటకర్లపల్లి లో పాండ్రంకి కళావతి (టీడీపీ), రెడ్డి శాంతమ్మ (వైసీపీ), పెదనడిపల్లిలో సప్ప లక్ష్మీ (టీడీపీ), ఇప్పిలి గౌరీదేవి (వైసీపీ), అలజంగి లో శనపతి శ్రీదేవి (టీడీపీ), మీసాల జ్యోతి (వైసీపీ), మెట్టపల్లి లో వెంపడాపు రాజేశ్వరి (టీడీపీ), మీసాల శారద (వైసీపీ), జనసేన నుంచి పీకే పాలవలస లో బైరెడ్డి మణికంఠ, బైరెడ్డి తవుడమ్మ (వైసీపీ), గొల్లల ములగాం లో చందక దుర్గా భవాని (టీడీపీ), కరిమజ్జి పద్మ (వైసీపీ), స్వతంత్ర్య అభ్యర్థులుగా నిమ్మలవలస నుంచి అలికాన ధనలక్ష్మి, కర్లం నుంచి దుగ్గు రామకృష్ణ, ఇటకర్లపల్లి నుంచి పాండ్రంకి మంగమ్మ, కరకం నుంచి మంత్రి సత్యనారాయణ లు పోటీలో ఉన్నారు.

రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా