జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహణ
3850 మంది విద్యార్థులు హాజరు - 86% హాజరు.
- డీఈవో నాగేశ్వరరావు
అనకాపల్లి, నవంబర్ 28, మేజర్ న్యూస్: జవహర్ నవోదయ విద్యాలయం, కొమ్మాదిలో 2027-2028 విద్యా సంవత్సరము నందు 6వ తరగతిలో ప్రవేశ నిమిత్తం అనకాపల్లి జిల్లాలో నవోదయ ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహించబడినట్లు జిల్లా విద్యాశాఖాధికారి గుంటూరు గౌరీ శంకర నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేసారు. జిల్లాలో గల 3 రెవెన్యూ డివిజన్లలో అనగా అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో 8 కేంద్రాలు, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌లో 6 కేంద్రాలు, అడ్డురోడ్ రెవెన్యూ డివిజన్‌లో 6 కేంద్రాలు మొత్తం 20 కేంద్రాలలో పరీక్ష నిర్వహించబడినట్లు తెలిపారు. మొత్తం 4340 మందికి గాను 3850 మంది హాజరైనట్లు, 490 మంది పరీక్షకు హాజరు కానట్లు, పరీక్షకు విద్యార్థులు 86% హాజరైనట్లు తెలిపారు. కొమ్మాది జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ వాడ్రేవు దుర్గాప్రసాద్ జిల్లాలో 7 పరీక్షా కేంద్రాలను, జిల్లా విద్యాశాఖాధికారి వారు 3 పరీక్షా కేంద్రాలను సందర్శించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ విజయ కృష్ణన్ వారి ఆదేశాల మేరకు అన్ని పరీక్షా కేంద్రాలలో వైద్య సదుపాయం, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, జిల్లాలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని జిల్లా విద్యాశాఖాధికారి పేర్కొన్నారు.