BREAKING
దేశాన్ని అస్థిర పరిచే కుట్రలను భగ్నం చేయలి . కలెక్టర్ కార్యాలయం వద్ద బిజెపి ధర్నా ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ సీఈసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ సూర్య కథనానికి స్పందన.. అగర్‌గూడకు బస్సు సర్వీసు ప్రారంభం సీఈసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో బైక్ ర్యాలీ సంక్షోభంలో రైతులు వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలి తులసి రెడ్డి పేదల ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ గొట్టిపాటి లక్ష్మి. మున్సిపల్ చైర్ పర్సన్ కు దివ్యాంగుల వినతి మూడో త్రైమాసికంలో వోక్స్ వ్యాగన్ డెలివరీలలో 14 శాతం పతనం గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు.. ఇద్దరు పాలస్తీనీయులు మృతి క్యూ1 లో అంచనాలను మించిన 'హేస్' నికర రుసుములు కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు. సెలవు రోజుల్లోనూ విద్యాసంస్థల నిర్వహణ.. పీడీఎస్‌యూ ఆందోళన గుత్తి మండలంలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు బంద్ చేయించిన విద్యార్థి సంఘం నిబంధనలు ఉల్లంఘించిన విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ నెల రోజుల్లోనే రూ.200 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం అనంతపురం నగర రూపురేఖలు మార్చడమే లక్ష్యం 20–25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం: ప్రసవం తర్వాత కడుపులోనే దూది, కత్తెర.. వైద్యుల తీవ్ర నిర్లక్ష్యంపై బంధువుల ఆగ్రహం!

జర్నలిస్టుల ఐక్యతే లక్ష్యం.. జేపీఎఫ్ కార్యాలయం ప్రారంభం

Select Suryaa Now
జర్నలిస్టుల ఐక్యతే లక్ష్యం.. జేపీఎఫ్ కార్యాలయం ప్రారంభం

పెనమలూరు, మేజర్ న్యూస్: జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ (జేపీఎఫ్) కార్యాలయాన్ని పెనమలూరులో ఘనంగా ప్రారంభించారు. కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్, పెనమలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. నియోజకవర్గానికి చెందిన పలువురు రిపోర్టర్లు పాల్గొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిస్టులకు వృత్తిపరంగా ఎదురయ్యే సమస్యలు, ఒత్తిళ్ల సమయంలో అండగా నిలవడం, వారి హక్కులను పరిరక్షించడం, సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జేపీఎఫ్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. జర్నలిస్టుల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తూ, ఐక్యంగా సమస్యల పరిష్కారానికి కృషి చేసే వేదికగా ఈ కార్యాలయం పనిచేయనుంది. జర్నలిస్టుల ఐక్యతే బలంగా, హక్కుల పరిరక్షణే ధ్యేయంగా జేపీఎఫ్ ముందుకు సాగాలని పలువురు ఆకాంక్షించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు, కృష్ణాజిల్లా.