జనసేన సమన్వయకర్తగా మండలి వెంకట్రామ్
జనసేన సమన్వయకర్తగా మండలి వెంకట్రామ్
అవనిగడ్డ, మేజర్ న్యూస్: జనసేన పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ పరిధి స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు, యువ నాయకుడు మండలి వెంకట్రామ్ నియమితులయ్యారు.
పార్టీ తాజాగా ప్రకటించిన ఈ కమిటీలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, డాక్టర్ మాధవి సభ్యులుగా ఉన్నారు. సేవాదళ్ సభ్యులుగా అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన బండ్రెడ్డి హరి, పండ్రాజు లంకమ్మ ప్రసాద్, సూదాని నందగోపాల్, తోట సోమశేఖర్, లంక సురేష్ నియమితులయ్యారు. అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా