జగ్గయ్యపేట మున్సిపల్ పిఠానికి టీడీపీ రెబల్ అభ్యర్థి నామినేషన్!!
*మునిసిపల్ చైర్మన్కు టీడీపీ రెబల్ అభ్యర్థి నామినేషన్..!*
_తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలి : ఆచంట సునిత_
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అంగన్వాడీ అధ్యక్షురాలు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆచంట సునీత టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన అభ్యర్థిత్వాన్ని గుర్తించి బలపరచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ ను ఆమె కోరారు. ముప్పై ఏళ్లుగా పార్టీలో ఉంటూ ఎంతో సేవ చేశానని ఆచంట సునీత అన్నారు. గతంలో రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయానని.. అయినా నిబద్ధతతో పార్టీలోనే కొనసాగుతున్నానని ఆమె తెలిపారు. గత అరాచక పాలనలో తనపై 25 కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాలు చేసిన మహిళలకు అవకాశాలు ఇవ్వాలని కోరారు. మహిళలను టీడీపీ ఎంతో ప్రోత్సహిస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ టీడీపీయేనని ఆమె గుర్తుచేశారు.
తన అభ్యర్థిత్వాన్ని పార్టీ బలపరుస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచి పని చేశానని అన్నారు. తన కష్టానికి, పోరాటానికి చైర్మన్ పదవికి అర్హురాలినని భావిస్తున్నానని అన్నారు. చైర్మన్ సీటు మహిళా రిజర్వేషన్ అయిన నేపథ్యంలో పార్టీకి ఎనలేని సేవ చేసిన ఓ మహిళగా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఆచంట సునీత అధిష్టానాన్ని కోరారు.
రిపోర్టర్ :శివా జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా