జగన్ రెడ్డి తీరువల్లే పులివెందులలో శాంతిభద్రతల సమస్య. టిడిపి యువ నాయకులు డాక్టర్ లలిత్ సాగర్.
ప్రజాస్వామ్యం గురించి జగన్ రెడ్డి నీతులు
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల మాకు విశ్వాసం ఉంది
జగన్ రెడ్డి తీరువల్లే పులివెందులలో శాంతిభద్రతల సమస్య.
టిడిపి యువ నాయకులు డాక్టర్ లలిత్ సాగర్.
సూర్య న్యూస్ దర్శి. పులివెందులలో ఏకగ్రీవం జరిగాయని వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందులలోని ప్రతివార్డు ఏకగ్రీవం చేశారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి నీతులు నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ అన్నారు.గత ఎన్నికల్లో పులివెందులలో ఏవిధంగా ఏకగ్రీవం చేశారని అందరూ ప్రశ్నించాలి. ఇవాళ ప్రజాప్రభుత్వ పాలనలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలను నిర్వహించడం జరుగుతోందని,.ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు పోలీస్ సెక్యూరిటీని కల్పించడం జరిగిందని, పులివెందులలో నామినేషన్ వేసేందుకు ఎవరూ అడ్డుపడలేదు నామినేషన్ వేశారు. పులివెందులలో శాంతిభద్రతల సమస్యను సృష్టించారు. గత రాత్రి వాహనాలను తగులబెట్టారు. నిందను కూటమి ప్రభుత్వంపైపై వేశారు. ప్రజలపై వారే దాడి చేసి మాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల మాకు విశ్వాసం ఉందని ,రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ఎన్నికలు జరుగుతున్నాయి. పులివెందులలోనే ఎందుకు సమస్యలు వస్తున్నాయి? ఇందుకు జగన్మోహన్ రెడ్డి వైఖరే కారణం. పులివెందులలో జగన్ రెడ్డి శాంతిభద్రతల సమస్యను సృష్టించారు. ఇప్పుడు తామే బాధితులం అని చెప్పుకుంటున్నారు. ఎన్నికలు జరుగుతున్నాయని తెలుసు. జగన్ రెడ్డి మాత్రం బెంగళూరులో ఉంటారు. ఆదివారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి వచ్చి సమస్యలు సృష్టించారు. అనంతరం హెలికాఫ్టర్ లో బెంగళూరు వెళ్లిపోయారు. జాతీయ మీడియాను పిలిచి శాంతిభద్రతల సమస్య అంటూ నిందలు వేస్తున్నారనీ,జగన్ రెడ్డి తీరువల్లే పులివెందులలో శాంతిభద్రతల సమస్య ఏర్పడిందని డాక్టర్ లలిత్ అన్నారు.