BREAKING
ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

జాతీయ స్థాయి హ్యక్‌థాన్‌లలో గీతం విద్యార్ధుల ప్రతిభ

Select Suryaa Now
జాతీయ స్థాయి హ్యక్‌థాన్‌లలో గీతం విద్యార్ధుల ప్రతిభ

విశాఖ ఎడ్యుకేషన్, సూర్య : కృత్రిమ మేధకు సంబంధించిన సరికొత్త ఆలోచనలపై న్యూఢిల్లీ  కలకత్తాలలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి హ్యక్‌థాన్ పోటీలలో గీతం విద్యార్ధులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. కలకత్తాలో జరిగిన జిడిజి టెక్‌స్ప్రింట్ హ్యక్‌థాన్‌లో 3వందల కంటే ఎక్కువ టీమ్‌లతో పోటీపడి  గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంకు చెందిన ఐదుగురు బిటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విద్యార్ధులు మొదటి స్థానాన్ని సాధించారు. చెన్న కేశవ్ మువ్వ, ఉమాసాయిశ్రీమశీన, నిఖిల్‌చేబోలు, సాకేత్ పోరురి మరియు వెంకట పదిమిల తో కూడిన విజేతల బృందం గర్బధారణ, ప్రసవానంతర పునరుద్దరణ మరియు ప్రారంభ బాల్యంలో తల్లులకు మద్దతుగా రూపొందించబడిన ఎఐ ఆధారిత వేధిక “నర్చర్‌నెట”ను అభివృద్ది చేసింది. ఆరోగ్య నిపుణుల సలహలతో అభివృద్ది చేయబడిన నర్చర్‌నెట్, 11కంటే ఎక్కువ భారతీయ భాషలలో ముందస్తు ఆరోగ్య ప్రమాద గుర్తింపు, మానసిక ఆరోగ్య మద్దతు మరియు శిశు సంరక్షణ మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ను పోటీలు జరిగిన కేంద్రంలోనే ముఖ్యంగా మొదటి 24 గంటల హ్యక్‌థాన్  సమయంలో అభివృద్ది చేయడం విశేషం. గీతం విజేతల బృందం తాము రూపొందించిన “నర్చర్‌నెట”ను ఇప్పుడు స్టార్టప్‌గా ముందుకు తీసుకువెళ్ళె ప్రయత్నం చేస్తోంది.  భారతదేశం అంతటా మాతా శిశు సంరక్షణ మద్దతుకు మెరుగుపరచడానికి  ఈ ప్లాట్‌ఫారమ్‌ను మరింత అభివృద్ది చేయనున్నారు. 
      మరో గీతం విద్యార్ధి బృందం  కొత్త ఢిల్లీలో ఇటీవల జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రేస్`2026 సందర్భంగా నిర్వహించిన ఐటియు ఎఐ ఫర్ గుడ్ బిల్ ఎ`థాన్ 5.0 లో  మÖడవ బహుమతిని గెలుచుకుంది. గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెటిజెన్స్ అండ్ డేటా సైన్స్ విభాగానికి చెందిన విద్యార్ధులు సాత్విక్ పార్ల, అన్నీ క్రిస్టియన్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ సప్న కలిసి ప్రైవేట్ 5జి నెట్‌వర్క్‌లలో ట్రబుల్‌షూటింగ్‌ను ఆటోమేట్ చేయడానికి రూపొందిచిన కృత్రిమ మేధ (ఎఐ) శక్తితో కూడిన పరిష్కారం “టెలీఏజెంట”ను అభివృద్ది చేశారు. ఈ సిస్టమ్ నెట్‌వర్క్ సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి సహకారం కోసం ఎఐ ఏజెంట్లనుఉపయోగిస్తుంది.  ఇది నెట్‌వర్క్ విశ్వసనీయతను మెరుగుపరచడంలో మరియు మాన్యువల్ జోక్యాన్ని తగ్గించడంలో సహయపడుతుంది. భారతదేశం అంతటా పరిశ్రమలు మరియు అత్యవసర సేవల్లో 5జి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరింస్తున్నందున సమర్ధవంతమైన నెట్‌వర్క్ నిర్వహణ అవసరాన్ని గీతం విద్యార్ధులు రూపొందించిన ఈ ఆవిష్కరణ పరిష్కరిస్తుంది. 
      గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ మరియు స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్  ఎస్.అరుణ్ కుమార్, గీతం సూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డైరక్టర్  డాక్టర్ కె.తిరుపతిరావు, సిఎసఇ విభాగం అధిపతి ప్రొఫెసర్ జి.వి.ఎస్.రాజ్‌కుమార్, డాక్టర్ కె.నవీన్‌కుమార్, అధ్యాపకులు విద్యార్ధుల ప్రతిభను  అభినందించారు. 

రిపోర్టర్ : సత్యనారాయణ, ఏయూ, విశాఖపట్నం.