ఇరగవరం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఇరగవరం మేజర్ న్యూస్ :
ఇరగవరం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన పల్లె పండగ 3.0లో భాగంగా మండలంలో పలు గ్రామాల్లో సి.సి రోడ్లుకు తణుకు శాసన సభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ శనివారం శంకుస్థాపనలు చేసారు మండలంలోని రేలంగి,గమళ్లపాడు,కేతావారిపాలెం,కె.ఇల్లిందలపర్రు, తూర్పువిప్పార్రు, కె.కుముదవల్లి,పేకేరు,అయితంపూడి,ఓగిడి,కొత్తపాడు, కంతేరు, అర్జునుడిపాలెం గ్రామాల్లో రోడ్లు అభివృద్ధికి శంకుస్థాపన చేసారు కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కె.వి.వి.సత్యనారాయణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ.శ్రీనివాస్,మండలస్థాయి అధికారులు,పంచాయితీ అభివృద్ధి అధికారులు,వి.బి.జి.రామ్జి సిబ్బంది,వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
దొరబాబు ఇరగవరం