ఇంటి పట్టా ఉన్న ప్రతి ఒక్కరూ గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవాలి
ఒంగోలు నగరంలో 153 మందికి రూ.2.50 లక్షల చొప్పున మంజూరు
కొత్తపట్నం మండలంలో 40 గృహాలకు రూ.2.89 లక్షల చొప్పున మంజూరు
కూటమి ప్రభుత్వం వచ్చాక 523 గృహాలకు రూ.14.62 కోట్ల మంజూరు
సూర్య ప్రతినిధి, ఒంగోలు :
సొంతింటి నిర్మాణానికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని దామచర్ల సూచించారు. శనివారం ఒంగోలు నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గానికి చెందిన 193 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దామచర్ల మాట్లాడుతూ ఒంగోలు నగరంలో 153 మంది లబ్ధిదారులకు ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షల విలువైన మంజూరు పత్రాలను అందజేసినట్లు తెలిపారు. కొత్తపట్నం మండలంలో 40 గృహాల నిర్మాణానికి ఒక్కొక్క ఇంటికి రూ.2.89 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 523 గృహాల నిర్మాణానికి రూ.14.62 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇంకా ఇంటి పట్టా ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు, కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.